కశ్యప ప్రజాపతి, వామనుడు, రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు వసియించి సిద్ధిపొంది వారి వలన ప్రసిద్ధిపొందిన పుణ్యప్రదేశము సిద్ధాశ్రమము. వేద కాలమునాటి సత్సంప్రదాయమును యధాతధముగా పునరుద్ధరింప తలంపుతో పరబ్రహ్మ బ్రహ్మకు ఉపదేశించిన బ్రహ్మవిద్యను గురుపరంపర న్యాయముగా అందచేయ తలంపుతో వ్యవస్ధాపకుని నివాస గృహము ప్రధాన కేంద్రముగా హైదరాబాదు యందలి వనస్థలిపురంలొ సిద్ధాశ్రమము నెలకొల్పబడి నేటికి 25 సం || ల నుండి పనిచేయుచున్నది.
కలియుగములో వ్యాసభగవానుడు తన భాగవతము పంచమ స్కంధము 6వ అధ్యాయము 10వ 11వ శ్లోకములలో చెప్పిన పరిస్థితులు క్రమక్రమముగా చోటుచేసుకొనుచున్నవి. ఈ పరిస్థితులలొ బౌద్ధ, జైన, మతములు ఏర్పడినవి. ఆ తరువాత కాలములో శైవ, వైష్ణవ, శాక్తేయ మతములు ఏర్పడినవి. పరాయి దేశస్థుల పాలనలొ ఇస్లాము, క్రైస్తవ మతములు కూడా మన దేశములో చోటుచేసుకొన్నవి. క్రైస్తవ మతప్రచారకులు వారి మతప్రచారముతో పాటు సాంఘిక సేవా కార్యక్రమములు కూడా చేసెడివారు.
ఇటివల కాలములో అనేక సంస్థలు ఏర్పడి వారి వ్యక్తిగత అభిప్రాయములను ప్రజలలో ప్రచారము చేయుచు సాంఘిక సేవ కార్యక్రమములు కూడ చేపట్టిరి . వీటి అన్నింటిలోనూ వేదకాలమునాటి ఆధ్యాత్మిక భావనా పూర్తిగా ప్రజలకు అందుట లేదు . ఈ పరిస్థితులలో వేదము నందలి ఆధ్యాత్మిక భావనను యధాతధముగా ప్రజలకు అందజేయుటతో పాటు వేదము చెప్పిన ఆత్మస్థానమును చేరు మార్గమును తెలియచేయుటకు సిద్ధాశ్రమము నడుము బిగించినది.
వేద కాలమునాటి సత్సంప్రదాయమును యధాతధముగా పునరుద్ధరించి , పరబ్రహ్మ బ్రహ్మకు ఉపదేశించిన బ్రహ్మవిద్యను గురుపరంపర న్యాయముగా అందజేసి ; వేదము నందలి ఆధ్యాత్మిక భావనను యధాతధముగా ప్రజలకు అందజేయుటతో పాటు వేదము చెప్పిన ఆత్మస్థానమును చేరు మార్గమును తెలియచేయుటకు సిద్ధాశ్రమము నడుము బిగించినది.
ఈ ఆశ్రమ సభ్యులకు సభ్యత్వ రుసుము లేదు. ఆధ్యాత్మిక విషయములను తెలుసుకొనవలయునన్న తీవ్రకాంక్ష కలవారందరు సభ్యులుగా చేరుటకు అర్హులు.
ఈ ఆశ్రమ వ్యవహారములు 3 స్థాయిలలో ఉండును.