సిద్ధాశ్రమం

బ్రహ్మవిద్యా సంప్రదాయము

అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్యమాం

శ్రీమహాదేవ పర్యంతాం వందే గురు పరంపరాం

ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో

వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః

పుస్తకాలు
అన్నీ చూడండి
ఫోటోలు

కశ్యప ప్రజాపతి , వామనుడు , రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు వసియించి సిద్ధిపొంది వారి వలన ప్రసిద్ధిపొందిన పుణ్యప్రదేశము సిద్ధాశ్రమము . వేద కాలమునాటి ప్రదాయమును యధాతధముగా పునరుద్ధరింప తలంపుతో పరబ్రహ్మ బ్రహ్మకు ఉపదేశించిన బ్రహ్మవిద్యను గురుపరంపర న్యాయముగా అందచేయ తలంపుతో వ్యవస్ధాపకుని నివాస గృహము ప్రధాన కేంద్రముగా హైదరాబాదు యందలి వనస్థలిపురంలొ సిద్ధాశ్రమము నెలకొల్పబడి నేటికి 34సం || ల నుండి పనిచేయుచున్నది.

కలియుగములో వ్యాసభగవానుడు తన భాగవతము పంచమ స్కంధము 6వ అధ్యాయము 10వ 11వ శ్లోకములలో చెప్పిన పరిస్థితులు క్రమక్రమముగా చోటుచేసుకొనుచున్నవి. ఈ పరిస్థితులలొ బౌద్ధ , జైన , మతములు ఏర్పడినవి . ఆ తరువాత కాలములో శైవ , వైష్ణవ , శాక్తేయ మతములు ఏర్పడినవి . పరాయి దేశస్థుల పాలనలొ ఇస్లాము , క్రైస్తవ మతములు కూడా మన దేశములో చోటుచేసుకొన్నవి . క్రైస్తవ మతప్రచారకులు వారి మతప్రచారముతో పాటు సాంఘిక సేవా కార్యక్రమములు కూడా చేసెడివారు. ఇటివల కాలములో అనేక సంస్థలు ఏర్పడి వారి వ్యక్తిగత అభిప్రాయములను ప్రజలలో ప్రచారము చేయుచు సాంఘిక సేవ కార్యక్రమములు కూడ చేపట్టిరి . వీటి న్నింటిలోనూ వేదకాలమునాటి ఆధ్యాత్మిక భావనా పూర్తిగా ప్రజలకు అందుట లేదు . ఈ పరిస్థితులలో వేదము నందలి ఆధ్యాత్మిక భావనను యధాతధముగా ప్రజలకు అందజేయుటతో పాటు వేదము చెప్పిన ఆత్మస్థానమును చేరు మార్గమును తెలియచేయుటకు సిద్ధాశ్రమము నడుము బిగించినది.

వీడియోలు
సంప్రదించండి
View all