మూలకారణము

కశ్యప ప్రజాపతి , వామనుడు , రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు వసియించి సిద్ధిపొంది వారి వలన  ప్రసిద్ధిపొందిన పుణ్యప్రదేశము సిద్ధాశ్రమము . వేద కాలమునాటి సత్సంప్రదాయమును యధాతధముగా పునరుద్ధరింప తలంపుతో పరబ్రహ్మ బ్రహ్మకు ఉపదేశించిన బ్రహ్మవిద్యను గురుపరంపర న్యాయముగా అందచేయ తలంపుతో వ్యవస్ధాపకుని నివాస గృహము ప్రధాన కేంద్రముగా హైదరాబాదు యందలి వనస్థలిపురంలొ సిద్ధాశ్రమము నెలకొల్పబడి నేటికి 25 సం || ల  నుండి పనిచేయుచున్నది.

కలియుగములో వ్యాసభగవానుడు తన భాగవతము పంచమ స్కంధము 6వ అధ్యాయము 10వ 11వ శ్లోకములలో చెప్పిన పరిస్థితులు క్రమక్రమముగా చోటుచేసుకొనుచున్నవి. ఈ పరిస్థితులలొ బౌద్ధ , జైన ,     మతములు ఏర్పడినవి . ఆ తరువాత కాలములో శైవ , వైష్ణవ , శాక్తేయ మతములు ఏర్పడినవి . పరాయి దేశస్థుల పాలనలొ ఇస్లాము , క్రైస్తవ మతములు కూడా మన దేశములో చోటుచేసుకొన్నవి . క్రైస్తవ        మతప్రచారకులు వారి మతప్రచారముతో పాటు సాంఘిక సేవా కార్యక్రమములు కూడా చేసెడివారు.

 

ఇటివల కాలములో అనేక సంస్థలు ఏర్పడి వారి వ్యక్తిగత అభిప్రాయములను ప్రజలలో ప్రచారము చేయుచు సాంఘిక సేవ కార్యక్రమములు కూడ చేపట్టిరి . వీటి అన్నింటిలోనూ వేదకాలమునాటి ఆధ్యాత్మిక భావనా పూర్తిగా ప్రజలకు అందుట లేదు . ఈ పరిస్థితులలో వేదము నందలి ఆధ్యాత్మిక భావనను యధాతధముగా ప్రజలకు అందజేయుటతో పాటు వేదము చెప్పిన ఆత్మస్థానమును చేరు మార్గమును తెలియచేయుటకు సిద్ధాశ్రమము నడుము బిగించినది.

ఆబ్జెక్టివ్

వేద కాలమునాటి సత్సంప్రదాయమును యధాతధముగా పునరుద్ధరించి , పరబ్రహ్మ బ్రహ్మకు ఉపదేశించిన బ్రహ్మవిద్యను గురుపరంపర న్యాయముగా అందజేసి ; వేదము నందలి ఆధ్యాత్మిక భావనను యధాతధముగా ప్రజలకు అందజేయుటతో పాటు వేదము చెప్పిన ఆత్మస్థానమును చేరు మార్గమును తెలియచేయుటకు  సిద్ధాశ్రమము నడుము బిగించినది.

 

           

సభ్యత్వము

ఈ ఆశ్రమ సభ్యులకు సభ్యత్వ రుసుము లేదు. ఆధ్యాత్మిక విషయములను తెలుసుకొనవలయునన్న తీవ్రకాంక్ష కలవారందరు సభ్యులుగా చేరుటకు అర్హులు.

ఈ ఆశ్రమ వ్యవహారములు 3 స్థాయిలలో ఉండును.

 

  1. ప్రారంభస్థాయి : ఈ స్థాయిలో వర్తమానకాలములోని పరిస్థితులకు అనుగుణముగా పూజలు , భజనలు , తీర్థయాత్రలు , ఉచిత వైద్యశిబిరములు , అన్నదాన కార్యక్రమములు మొదలైన సేవ కార్యక్రమములు ఉండును. ఆవిధముగా రామకోటి స్తంభము , కోటిబిల్వార్చన , విరాట్ స్వరూప ఈశ్వరార్చన మొదలైన పూజలు జరుపబడినవి . ఆ సేతు హిమాచల పర్యతము గల పుణ్య క్షేత్రములతో పాటు కాలినడకన నేపాల్ లో గల ముక్తినాధ్ క్షేత్రమును కూడ బహు ప్రయాసలతో దర్శించడమైనది. మహాశిరాత్రి సందర్భమున శ్రీకాకుళం జిల్లా చాపకోట సమీపమున మహేంద్రగిరి యాత్రకు వచ్చు యాత్రీకులకు ఉచిత భోజన , వైద్య సదుపాయములు గత 2 సం || లు జరుపబడినవి.

 

  1. మధ్యమస్థాయి : ఈ స్థాయి వారికై ఆధ్యాత్మిక భావనలు , సాధనలు పరిచయముగా పుస్తక ప్రచురణలు చేపట్టి భక్తులకు అందచేయబడుచున్నవి . ఆ విధముగా ఇప్పటికి పూజాపుష్పములు, పూజావిధానము , భూతనాధోపాఖ్యానము , బ్రహ్మవిద్యారత్నాకరము , అను పుస్తకములు ప్రచురింపబడినవి . అటులనే అనతి కాలములొ నిత్యకర్మానుష్థానమునకు సంబంధించిన సంధ్యావందనము , బ్రహ్మయజ్జ్ఞము మొదలైనవి అటులనే భగవద్గీత మొదలైన పుస్తకములు ప్రచురింపబడును.

 

3 .  ఉన్నతస్థాయి : ఈ స్థాయిలొ సాధకులు వకచోట కూర్చొని వేదములు , రామాయణ , భారత  భాగవతాది పూరణములలోని రహస్యములను చర్చించుకొనుచు ఆత్మస్థానము పొందు సాధన చేయుచు ఋషుల పంన్ధాలో పయనించెదరు.